తెలంగాణ

telangana

ETV Bharat / state

రహదారిపై విరిగిపడిన చెట్లు.. 5గంటల పాటు ట్రాఫిక్ జాం

దేవరకొండ - సత్తుపల్లి జాతీయ రహదారిపై ఖమ్మం జిల్లా నూతనకల్లు, రంగం బంజర్​ గ్రామాల మధ్య వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున వీచిన ఈదురు గాలులకు చెట్లు రహదారిపై అడ్డంగా పడిపోయాయి. 5 గంటల పాటు అధికారులు ఎవరూ పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు.

Traffic jam, nuthanakallu,  rangam banjar,  khammam
Traffic jam, nuthanakallu, rangam banjar, khammam

By

Published : May 6, 2021, 12:17 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నూతనకల్లు, రంగం బంజర్​ గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడి.. వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. తెల్లవారుజామున వీచిన గాలులకు 5 చెట్లు దేవరకొండ, సత్తుపల్లి జాతీయ రహదారిపై పడిపోయాయి.

మూడు గంటల సమయంలో చెట్లు పడిపోగా.. వాటిని తొలగించేందుకు ఉదయం ఎనిమిది గంటల వరకు అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇరువైపులా పది కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 8 గంటల సమయంలో చెట్లు తొలగించడం వల్ల ట్రాఫిక్ క్లియర్ అయింది. 5 గంటల పాటు అధికారులు నిర్లక్ష్యం వహించారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:భారత్​లో కరోనా.. ప్రపంచానికి ప్రమాద ఘంటిక!

ABOUT THE AUTHOR

...view details