కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి - కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా... ఇద్దరు మృతి
11:36 December 29
ప్రమాద సమయంలో ట్రాక్ట్రలో 25 మంది కూలీలు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీల్లచెరువు వద్ద అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందగా... 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో మొత్తం 25 మంది కూలీలు ఉన్నారు. వారంతా పత్తి తీసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఇవీ చూడండి: చర్మానికీ ఓ బ్యాంకు... ఉస్మానియాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు