ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం శ్రీరామగిరి సమీపంలో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 15 మంది కూలీలు ఉండగా పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఒరిస్సాకు చెందినవారు.
ఏన్కూరులో ట్రాక్టర్ బోల్తా... పదిమంది కూలీలకు గాయాలు - road accident in khammam ten agriculture labor injured
ట్రాక్టర్ బోల్తాపడి పది మంది ఒరిస్సాకు చెందిన కూలీలు గాయపడిన ఘటన ఏన్కూరు మండలంలో జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఏన్కూరులో ట్రాక్టర్ బోల్తా... పదిమంది కూలీలకు గాయాలు
లచ్చగూడెం నుంచి శ్రీరామగిరి వైపు వెళ్తుండగా మార్గ మధ్యలో మలుపు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. క్షతగాత్రులను హుటాహుటిన ఏన్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కింద ఎవరూ పడకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది.
ఇదీ చూడండి: అత్తారింటికి వెళ్లిన ఆమె ఎలా అదృశ్యమైంది..?