ఖమ్మం జిల్లా ఏన్కూరులో వివిధ ప్రాంతాలకు చెందిన పోడుభూమి హక్కుదారులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులపై అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనుల ఆందోళన - khammam district today latest news
పోడు భూములపై అటవీశాఖ అధికారుల దాడులు అరికట్టాలని ఖమ్మం జిల్లా ఏన్కూరులో గిరిజనులు ఆందోళన చేశారు. పలు డిమాండ్లతో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
హక్కుపత్రాలు ఇవ్వాలని గిరిజనులు ఆందోళన
పోడుభూమి దారులకు హక్కుపత్రాలు ఇవ్వాలని, సాగు చేసుకునే వారికి పట్టాలు మంజూరు చేయాలని కోరారు. పలువురు మహిళా రైతులు తమ భూములు లాక్కుని అటవీశాఖ అధికారులు నాశనం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి :సూది బెజ్జంలో ట్రంప్.. అభిమాని కళారూపం