సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయని ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఏన్కూరు, కారేపల్లి మండలాలలో జరుగుతున్న ప్రతిపాదిక కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
అటవీ ప్రాంతం సందర్శన
కారేపల్లి సమీపంలో అటవీ ప్రాంతాన్ని సందర్శించి కాలువ నిర్మాణం, మ్యాప్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు. డీఈలు వెంకన్న, రాందాస్‌లు జూలూరుపాడు మండలం నుంచి కొనసాగనున్న పనులు, పాలేరు జలాశయం వరకు నీటి మళ్లింపు పనులను వివరించారు.