తెలంగాణ

telangana

ETV Bharat / state

టిప్పర్​ లారీ ఢీకొట్టింది.. ధర్నా చేసిన బంధువులు - టేకులపల్లి

బైక్​పై వెళ్తున్న యువకుడిని టిప్పర్​ లారీ వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

Tipper lorry collides relatives participate in dharna at khammam
టిప్పర్​ లారీ ఢీకొట్టింది.. ధర్నా చేసిన బంధువులు

By

Published : Mar 12, 2020, 7:16 PM IST

ఖమ్మం జిల్లా బుధవారం రాత్రి టేకులపల్లి మండలంలో బొగ్గు టిప్పర్ ఢీకొని గోగెల రవి(26)మృతి చెందాడు. దాసుతండా సమీపంలో బుధవారం రాత్రి కోయగూడెం ఉపరితల గని వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్ బైక్​పై వెళ్తున్న వ్యక్తిని వెనుకనుంచి ఢీకొట్టింది. స్థానికులు గ్రామానికి చెందిన రవిగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు తెలిపారు.

టిప్పర్​ లారీ ఢీకొట్టింది.. ధర్నా చేసిన బంధువులు

కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో టేకులపల్లి రహదారిపై ధర్నా చేశారు. ఆందోళన తీవ్రంగా మారడం వల్ల పోలీసులు వారికి నచ్చ జెప్పి పంపించారు.

ఇదీ చూడండి :తెలంగాణ పెళ్లిలో విదేశీయుల తీన్​మార్

ABOUT THE AUTHOR

...view details