తెలంగాణ

telangana

ETV Bharat / state

కేంద్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా: తుమ్మల - Thummala nageswara rao

దేశంలో రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కారేపల్లిలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెరాసలో చేరారు. నామకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మంలో తెరాస ఎన్నికల ప్రచారం

By

Published : Apr 8, 2019, 7:53 PM IST

కేంద్రంలో కాంగ్రెస్, భాజపా బలం తగ్గిందని ప్రాంతీయ పార్టీల సమన్వయంతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పడనుందని తుమ్మల నాగేశ్వరరావు జోస్యం చెప్పారు. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం ఉండేవిధంగా 17 స్థానాల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామకు మద్దతుగా కొనిజర్ల, వైరా మండలాల్లో రోడ్ షో నిర్వహించారు. తుమ్మలతో పాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్ పాల్గొన్నారు.

ఖమ్మంలో తెరాస ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details