ఖమ్మం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తనికెళ్ల మేజర్ పంచాయతీ.. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో తనవంతు బాధ్యతగా సర్పంచ్ మోహన్‌రావు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. గ్రామంలోకి బయటివారెవ్వరూ రాకుండా కంచె వేసి నియంత్రించిన ఆయన.. ఆ తర్వాత ప్రభుత్వం ఆదేశాలతో చెక్‌పోస్టు ఏర్పాటు చేశాడు. సమయం ప్రకారం పంచాయతీ సిబ్బందికి అక్కడ విధులు నిర్వహించే విధంగా చర్యులు తీసుకున్నారు.
కరోనా కట్టడిలో ఆ సర్పంచ్ సేవలు ఆదర్శం - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
గ్రామ ప్రథమ పౌరుడిగా గ్రామాభివృద్ధికి పాటుపడడమే కాదు.... గ్రామస్థుల ఆరోగ్య రక్షణపై ప్రత్యేకత చాటుతున్నాడు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సర్పంచ్ చల్లా మోహన్‌రావు. స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కోటేశ్వరరావు సహాయంతో నెలరోజులుగా స్వయంగా గ్రామంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయించి తనిఖీలు చేపడుతున్నాడు.

కరోనా కట్టడిలో ఆసర్పంచ్ సేవలు అభినందనీయం
గ్రామం నుంచి ఎవ్వరైనా బయటకు వెళ్లిన... లోపలికి వచ్చినా చెక్‌పోస్టు వద్దనే శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే అనుమతిస్తున్నారు. మా ఊరికి మీరు రావద్దు.. మీ ఊరికి మేము రాము అంటూ బ్యానర్లు ఏర్పాటు చేసి కోవిడ్-19పై చైతన్యం కల్పిస్తున్నారు.
ఇవీ చూడండి:సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు..వరుడికి కేటీఆర్ ప్రశంసలు