కరోనా కాలంలో కార్పొరేట్ ఆస్పత్రులు మూతపడినా... గ్రామస్థాయిలో ఆర్‌ఎంపీలు ప్రజలకు సేవలందించారని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బురద రాఘవాపురంలో ఆర్‌ఎంపీల సహకారంతో 100 మంది వలస కూలీలకు బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. వైద్యసేవలతోపాటు సరుకుల వితరణ చేసి ఆర్‌ఎంపీలు మానవత్వం చాటారన్నారు. ఇదే స్పూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం జూలూరుపాడు మండలం గురవాగుతండాలో సైతం వలస కూలీలకు ఎమ్మెల్యే నిత్యావసరాలు అందజేశారు. మరోవైపు వైరా పురపాలికలోని 12వ వార్డు కౌన్సిలర్ వనమా విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
గ్రామీణ వైద్యుల సేవలు ప్రశంసనీయం : రాములు నాయక్ - RMP Doctor Essential Commodities Distribution
గ్రామీణ వైద్యుల సేవలు ప్రశంసనీయమని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. జిల్లాలోని ఏన్కూరు మండలం బురద రాఘవాపురంలో ఆర్‌ఎంపీల సహకారంతో 100 మంది వలస కూలీలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
సరుకుల పంపిణీ