ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేశారు. తరతరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల భూములను అటవీశాఖ అధికారులు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
పోడు భూములకు పట్టాలివ్వండి.. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నిరసన - తెలంగాణలో పోడు భూముల సమస్య
గిరిజనులు, అటవీ శాఖ అధికారుల మధ్య పోడు భూముల వివాదం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటున్న గిరిపుత్రుల సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేశారు. అనంతరం డీఆర్వో ఎల్లయ్యకి వినతి పత్రం అందించారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: సీపీఐ
హరితహారం పేరిట అటవీ శాఖ అధికారులు వ్యవసాయం చేసుకోనియకుండా సమస్యలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు దాడులను విడనాడాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో ఎల్లయ్యకు నాయకులు వినతిపత్రం అందించారు.