తల్లి చనిపోయింది... దశదినకర్మ అయిన పూర్తి కాకముందే గుండెపోటుతో కుమారుడు సైతం దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామంలో చోటుచేసుకుంది.
'తల్లి మరణం తట్టుకోలేక.. ఆగిన కుమారుడి గుండె' - Maturu village latest news
అన్నింట్లో అండగా ఉన్న అమ్మ మృతిని జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లి దశదినకర్మ కూడా పూర్తి కాలేదు. ఇంతలోనే ఆ కుమారుడి గుండె ఆగిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన వేల్పుల అనంతయ్య, మస్తానమ్మకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారికి వెంకయ్య నాలుగో సంతానం. చిన్నతనంలోనే అనంతయ్య కాలం చేశారు. దీనితో తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది. వారం కిందట ఆ తల్లి మృతి చెందింది. నాటి నుంచి కుమారుడు వెంకయ్య దిగులు చెందుతూ మనోవేదనకు గురయ్యాడు. ఇంకా రెండు రోజుల్లో తల్లి దశదిన కర్మ చేయాల్సి ఉండగా ఆకస్మాత్తుగా కుమారుడు వెంకయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పూరి పాకలో నివాసముండే నిరుపేద కుటుంబం వీరిది. వెంకయ్య మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు.
ఇదీ చూడండి :'కిలాడీ దంపతులు.. చిట్టీల మోసంలో ఆరితేరారు!