తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారుడు అనారోగ్యంతో మరణించిన ఘటన... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లి పంచాయతీ తవిసిబోడులో చోటుచేసుకుంది. భూక్య నాగేశ్వరరావు ఉద్యమ ఆకాంక్షను వైరా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంచేశారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2009 నుంచి 14 వరకు వైరా ప్రాంతీయ ఇన్ఛార్జిగా పనిచేశారు.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా సమైక్య పాలకుల ప్రభుత్వాల ప్రతి ఘటనలను ఎదుర్కొంటూ ఉద్యమ ఆకాంక్షను బలంగా వినిపించారు. కాలం చిన్న చూపు చూడడంతో పక్షవాతంతో మంచాన పడ్డారు.