తెలంగాణ

telangana

ETV Bharat / state

వానరాలపై యువకుల మానవత్వం

లాక్​డౌన్​ కారణంగా ప్రతి రోజు పేదలు, వలస కూలీల ఆకలి కేకలు వింటూనే ఉన్నాం... వారి దీన గాధల్ని చూస్తూనే ఉన్నాం. ఆహారాన్ని స్వతహాగా తయారుచేసుకోగల మనుషుల పరిస్థితే ఇలా ఉంటే... మూగజీవాల మాటేమిటి.? వాటి నిత్యవసరాలు తీర్చే దిక్కెవరు.? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ మూగజీవాలను చూసి చలించిపోయిన ఖమ్మం జిల్లాకు చెందిన నలుగులు యువకులు వారం రోజులుగా వానరాలకు ఆహారం, నీటిని సమకూరుస్తూ వాటిపై తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు.

By

Published : Apr 26, 2020, 12:41 PM IST

The Humanity of young people on monkeys
వానరాలపై యువకుల మానవత్వం

లాక్​డౌన్​... ఈ మధ్య ఎక్కడ చూసినా... ఏం చేసినా వినిపించే మొదటి పదం. దీని వల్ల పేదల ఆకలి కేకలు మరింత విస్తృతమయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు కావాల్సిన ఆహార పదార్థాలను స్వతహాగా తయారుచేసుకోగల మనుషులే ఇంతటి విపత్కర స్థితిలో ఉంటే... స్వయం ఉత్పత్తి చేసుకోలేని మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే హృదయం బరువెక్కిపోతుంది. వాటికి ఆహారం లభించే మార్గాలు చాలా వరకు మూసుకుపోయాయి. ఈ క్రమంలో వానరాలు ఆకలితో అలమటిస్తూ, తాగునీరు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ప్రజలకు... ప్రభుత్వాలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తుండగా... అడవుల్లోని కోతులు మాత్రం పస్తులుంటున్నాయి. వాటి దీన స్థితిని చూసి చలించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి యువకులు రాధాకృష్ణ, నరేష్, చిరంజీవి, ప్రశాంత్... వారంరోజులుగా వాటికి ఆహారం అందిస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఇంటి వద్ద తయారుచేసిన ఆహారంతోపాటు జామకాయలు, అరటి పండ్లు, జీడీకాయలు, తాగునీటిని ఆటోలో తీసుకెళ్లి... చెరుకుపల్లి అడవుల్లోని కోతులకు అందిస్తున్నారు. మూగజీవాలపై వీరు చూపిస్తున్న ఉదారత నిజంగా అభినందనీయం.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details