Dalit Bandhu funds released: దళితబంధు పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం - నాలుగు జిల్లాల్లో దళితబంధు

19:42 December 21
Dalit Bandhu funds released:దళితబంధు పథకానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
Dalit Bandhu funds released: రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలకు రూ.50 కోట్లు చొప్పున కేటాయించింది.
dalit bandhu in TS: ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి మాత్రమే రూ.100 కోట్లు విడుదల చేసింది. ఆయా మండలాలకు సంబంధించిన నిధులు జిల్లాల కలెక్టర్ల ఖాతాలో జమ చేస్తున్నట్లు వెల్లడించింది. దళితబంధు పథకం అమలుపై ఇటీవల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నిధులు విడుదల చేశారు.