ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో పట్టభద్రుల ఓటుహక్కు నమోదు ప్రక్రియ తొలిరోజు విస్తృతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, తెరాస కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయాల్లో ఓటు నమోదు చేసుకున్నారు. 20 రోజులుగా పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను కార్యకర్తలు అధికారులకు అందజేశారు.
విస్తృతంగా సాగిన తొలిరోజు ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదు ప్రక్రియ - ఖమ్మంలో మొదటిరోజు ఎమ్మెల్సీ ఓటుహక్కు నమోదు ప్రక్రియ
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలోని నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఓటుహక్కు నమోదు ప్రక్రియ తొలిరోజు విస్తృతంగా నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు వారివారి ఓట్లను నమోదు చేసుకున్నారు.
వైరాలో ఎమ్మెల్యే రాములునాయక్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తల్లాడ, ఏన్కూరు, కొణిజర్ల, జూలూరుపాడు, కారేపల్లిల్లోని తెరాస నాయకులు, యువజన నాయకులు ఓటుహక్కును నమోదు చేసుకున్నారు. అర్హులు ఓటుహక్కు నమోదు చేసుకుని తెరాస అభ్యర్థి విజయానికి కృషిచేయాలని ఎమ్మెల్యేలు తెలిపారు. గతంలో నిర్వహించిన అన్ని ఎన్నికల్లో తెరాస ప్రతిపక్షాలకు గట్టిపోటీగా నిలిచిందని, అధిక మెజార్టీతో విజయం సాధించామని నాయకులు తెలుపుతూ అదే స్పూర్తితో ఈ ఎన్నికల్లోనూ గెలుపుకు కృషిచేయాలన్నారు.
ఇదీ చూడండి:ఉపాధిహామీ రాష్ట్ర ఐదో కౌన్సిల్ సమావేశం.. పాల్గొన్న మంత్రులు