ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెరాస అక్రమాలను అరికట్టడంలో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు విమర్శించారు. తెరాస కార్యకర్తలు.. ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచడాన్ని అధికారులు గమనించినా .. దిష్టి బొమ్మాల్లా చూశారే తప్ప అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. యంత్రాంగం పూర్తిగా విఫలమైంది' - ఎన్నికల యంత్రాంగం విఫలం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడిందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆరోపించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో.. అధికారులు విఫలమయ్యారని విమర్శించింది.
'ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. యంత్రాంగం పూర్తిగా విఫలమైంది'
పట్టభద్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేశారన్నారు రంగారావు. తెజస ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరామ్‌కు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:కుట్రలతో నన్ను అడ్డుకోలేరు: మమత