ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గోపాల్రావు సురక్షితంగా బయటపడ్డారు.
సత్తుపల్లి న్యాయస్థానంలో ద్వితీయ శ్రేణి న్యాయమూర్తిగా పనిచేస్తున్న గోపాల్రావు తల్లాడ వైపు నుంచి సత్తుపల్లి వెళుతున్నారు. మిట్టపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి.. కారు బావిలోకి దూసుకెళ్లింది. వెంటనే గోపాల్రావు అద్దాలు పగులగొట్టుకుని బయటికి వచ్చారు.