ఖమ్మం జిల్లా మధిరలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. వారం రోజులుగా సాగుతున్న ఈ బ్రహ్మోత్సవాల్లో స్థానిక వర్తక సంఘం పద్మావతి సమేత శ్రీవారికి వ్రతాలను నిర్వహించారు.
వైభవంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు - Khammam District Latest News
మధిరలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు.. భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
వేదికపై ఉత్సవ విగ్రహాలను అర్చకులు పూలమాలలతో అందంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కల్యాణం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు.. భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'హైదరాబాద్ ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి'