సీపీఎం పేదల పార్టీ అని.. రైతులకు, కూలీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమ్మినేని హాజరయ్యారు. జెండా ఆవిష్కరించారు.
'సీపీఎం పేదల పార్టీ.. రైతులకు, కూలీలకు అండగా ఉంటుంది'
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ముఖ్య అతిథిగా పాల్గొని.. జెండా ఆవిష్కరించారు.
సీపీఎం, తమ్మినేని వీరభద్రం, ముదిగొండ
కేంద్రంలో భాజపా మతోన్మాద పార్టీగా అవతరించిందని తమ్మినేని విమర్శించారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని.. కులమతాలకు రాజకీయ రంగులు పులుముతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, తెరాస కార్యకర్తలు కొందరు సీపీఎంలో చేరారు.
ఇదీ చూడండి: దొంగతనం చేసి కల్లు తాగారు... వింత చేష్టలతో ఆస్పత్రి పాలయ్యారు