తెలంగాణ

telangana

ETV Bharat / state

బంధువుల ఇంటికి వెళ్లిన వాళ్లు ఎలా చనిపోయారు..? - MURDER

బంధువుల ఇంటికని బయలుదేరిన తండ్రీకూతురు వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహాలుగా కనిపించారు. ఈ ఘటన ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో కలకలం రేపుతోంది.

బంధువుల ఇంటికి వెళ్లిన వాళ్లు ఎలా చనిపోయారు..?

By

Published : May 17, 2019, 12:42 PM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామానికి చెందిన కృష్టయ్య తన చిన్న కుమారై శిరీష కలిసి ఈనెల 11న ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పండ్రేగుపల్లిలోని బంధువులు ఇంటికి బయలుదేరారు. కృష్ణయ్య విజయవాడలోని రైల్వే ట్రాక్​పై పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో కనపడగా... కూతురు శిరీష ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని వ్యవసాయ భూమిలో మృతదేహంగా కనపడింది. కృష్ణయ్యను 12న స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ 14న మృతి చెందాడు. బావిలో లభ్యమైన శిరీష మృతిపై నేలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం ఎవరిదో తెలియకపోవడం వల్ల... స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దహన సంస్కారాలు నిర్వహించారు. మృతి చెందిన యువతి వివరాలు ఈ రోజు వెలుగులోకి వచ్చాయి. ఆమె తాడ్వాయికి చెందిన శిరీషగా గుర్తించారు. శిరీష సూర్యాపేటలోని ఓ ప్రైవేటు కళశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతోంది. తండ్రీకూతురు ఇద్దరు చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బంధువుల ఇంటికి వెళ్లిన వాళ్లు ఎలా చనిపోయారు..?

ABOUT THE AUTHOR

...view details