ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో సింగరేణి విస్తరణ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ.. రైతులు, స్థానికుల నిరసనలతో ఉద్రిక్తంగా మారింది. సింగరేణి గనుల కారణంగా తమ ప్రాంతానికి ఎటువంటి అభివృద్ధి నిధులు రావడం లేదని, రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని, భూగర్భ జలాలు అడుగంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి విస్తరణ పనుల ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత - khammam district news
తమ భూముల్లో సింగరేణి ఉపరితల గనులు ఏర్పాటు చేస్తూ.. తమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని రైతులు, స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి నిరసనలతో సింగరేణి విస్తరణ కోసం జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
తమ భూముల పరిధిలో సింగరేణి సంస్థ ఉపరితల గనులు ఏర్పాటు చేస్తూ.. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఇతర ప్రాంతాలపై దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల నిరసన మధ్య అధికారులు కొందరు వెళ్లిపోయారు. ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సింగరేణి సోలార్ ప్రాజెక్టుకు ఇల్లందు పేరు పెట్టడం పట్ల గతంలోనూ నిరసనలు జరిగాయి.
సింగరేణి సంస్థ వల్ల తమకు అన్యాయం జరిగినా పరిహారం రాలేదని 1,218 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతు సుందర్ తమకు చనిపోవడానికి అనుమతి ఇవ్వాలని రాసి ఉన్న దుస్తులు ధరించి సభకు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు జిల్లా కలెక్టర్ రావాలని వేదిక ముందు బైఠాయించారు.
- ఇదీ చూడండి :న్యాయవాద దంపతుల హత్యకేసులో మరొకరు అరెస్ట్