కొత్త ఏడాది మొదటి రోజును పురస్కరించుకుని ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. స్థంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు, అర్చనలు చేయించారు.
'భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు' - ఖమ్మంలో నూతన సంవత్సర ప్రత్యేక పూజలు
నూతన సంవత్సర ప్రారంభ దినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పలు దేవాలయాలు భక్తులతో కళకళలాడాయి. ఈ ఏడాది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరతూ ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
!['భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు' temples-lined-with-devotees-in-khammam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10079719-1035-10079719-1609487083677.jpg)
' భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు '
ఈ నూతన సంవత్సరంలో అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని జిల్లాలోని ఆలయాల్లో పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని ఇందిరానగర్ రామాలయం, జలాంజనేయస్వామి వారి ఆలయం తదితర ఆలయాల్లో భక్తులు స్వామి వారి దర్శనాల కోసం బారులు తీరారు.
ఇదీ చదవండి:ఖమ్మంలో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ