తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దంచికొడుతున్న ఎండలు - భానుడి భగభగలు

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి ప్రతాపం వల్ల జనం అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండడం వల్ల జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.

temperature levels raises in khammam district
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దంచికొడుతున్న ఎండలు

By

Published : May 28, 2020, 8:08 PM IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలతో జనం అల్లాడుతున్నారు. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత తీవ్రవుతుండటం వల్ల ప్రజానీకం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఉక్కపోత, మరోవైపు ఎండ వేడిమితో అల్లాడిపోతున్నారు. ఖమ్మం , భద్రాద్రి జిల్లాలో గత నాలుగురోజులుగా ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతూ ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటిపోగా... కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి.

ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇక 12 గంటల నుంచి ఎండల తీవ్రత పెరుగుతుండటం వల్ల జనం బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా బయటకు రావడం లేదు.

ఇవీ చూడండి: కేటీఆర్​కు అరుదైన గౌరవం.. వర్చువల్ సదస్సుకు ఆహ్వానం..

ABOUT THE AUTHOR

...view details