Boy Fell in River : రోజూలాగే ఆరోజూ పాఠశాలకు వెళ్లాడు. క్లాసులన్ని పూర్తయ్యాక.. తిరిగి ఇంటికి పయనమయ్యాడు. దారిలో ఓ నది.. దానిపై వంతెన. అలా వంతెనపై నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఆ బాలుడికి గట్టిగా హారన్ శబ్ధం వినడపటంతో ఉలిక్కిపడింది. అప్పటికే ముందు ఓ బస్సు వస్తోంటే పక్కకి జరిగాడు. ఇప్పుడు వెనక నుంచి మరో బస్సు వస్తోంది. రెండు బస్సులు ఎదురెదురుగా వస్తున్నాయి. ఆ వంతెన చిన్నదిగా ఉండటం వల్ల బస్సులు పట్టే స్థానం మాత్రమే ఉంది. ఏంచేయాలో అర్థంగాక ఆ బాలుడు వంతెన గోడపైకి ఎక్కాడు. బస్సులు వెళ్లగానే దిగడానికి ప్రయత్నించగా..కాలు తట్టుకుని వంతెన పైనుంచి నదిలో పడిపోయాడు. నదిలో నీళ్లు ఎక్కువగా లేకపోవడం వల్ల అతడి ప్రాణాలు దక్కాయి.
Boy Fell in River in Khammam : కానీ అటువైపు వెళ్లే వారికి బాలుడు కనిపించడు. ఎంత అరిచినా ఎవరికీ వినపడదు. సరే అని లేచి నడచి వెళ్దామనుకుంటే.. పై నుంచి పడటంతో కాళ్లు విరిగిపోయాయి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో నీటిలో.. చలిలోనే బిక్కుబిక్కమంటూ ఏడుస్తూ కూర్చున్నాడు. మరోవైపు ఆ బాలుడి కోసం ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఎంతకీ తమ కుమారుడు రాకపోవడంతో గాబరా చెందారు. చుట్టుపక్కల అంతా వెతికారు. స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఉదయాన్నే పాఠశాలకని వెళ్లిన కొడుకు రాత్రైనా రాకపోవడంతో అతని కోసం నిరీక్షిస్తూ ఆందోళన చెందారు.