ఘనంగా ప్రపంచ తెలుగు భాషా దినోత్సవ వేడుకలు - telugu language day celebrations
ప్రపంచ తెలుగు భాషా దినోత్సవాన్ని ఖమ్మం జిల్లా మధిరలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
ఘనంగా ప్రపంచ తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ మాధురి అధ్యక్షతన ప్రపంచ తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో తెలుగు పండితులు వెంకట వరప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మాతృభాష గొప్పతనాన్ని విద్యార్థులు తెలుసుకుని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.