తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు - ఖమ్మం జిల్లాలో తెదేపా ఆవిర్భావ వేడుకలు

తెదేపా 40వ ఆవిర్భావ వేడుకలు ఖమ్మం జిల్లా మధిరలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం కేక్​ కట్​ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంబేడ్కర్​ కూడలి వద్ద ఉన్న ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

tdp Anniversary Celebrations in madiara
ఖమ్మం జిల్లాలో తెదేపా ఆవిర్భావ వేడుకలు

By

Published : Mar 29, 2021, 2:40 PM IST

తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి ప్రజల గుండెల్లో చిరస్థానం ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అన్నారు. తెదేపా 40 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిరలోని పార్టీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.

పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కేక్​ కట్​ చేసిన రామనాథం అంబేడ్కర్​​ కూడలి వద్ద ఉన్న ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు, మధిర పట్టణ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని పలు కూడళ్లలో జెండా దిమ్మలను ఆవిష్కరించారు

ఇదీ చదవండి:బిల్లు చెల్లించకపోతే.. కరెంట్ కనెక్షన్ కట్

ABOUT THE AUTHOR

...view details