ఖమ్మం జిల్లాలో సేకరించిన ధాన్యం నిల్వలను మిల్లులకు తరలించేందుకు తక్షణమే అన్ని చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మరో 10 రోజుల్లో జిల్లాలో ధాన్యం తరలింపు పూర్తిచేయాలని.. ఆ దిశగా యంత్రాంగం ఏర్పాట్లు చేయాలని సూచించారు. ధాన్యం సేకరణపై ఖమ్మంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
'మరో పది రోజుల్లో జిల్లాలో ధాన్యం తరలింపు పూర్తవ్వాలి' - khammam district news
మరో 10 రోజుల్లో ఖమ్మం జిల్లాలో ధాన్యం తరలింపు ప్రక్రియ పూర్తవ్వాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటికే రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించామని.. మరో లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలను మిల్లులకు తరలించాల్సి ఉందని తెలిపారు. మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని.. రవాణా చేస్తున్న సమయంలో లారీ యజమానులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఉందని.. ఒకవేళ అలాంటి పనులు చేస్తే.. వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నా.. కొన్ని పార్టీలు మాత్రం దొంగ దీక్షలు చేస్తున్నాయని మంత్రి విమర్శించారు.