Telangana Ministers Review on Prajapalana Program :సంక్షేమ పథకాల అమలుపై దృష్టిసారించిన కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతీ నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజాపాలన దిశగా సాగుతోంది. ఈనెల 28 నుంచి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ దిశగా ఏర్పాట్లు ప్రారంభించింది.
Congress Ministers Focus on Prajapalana Program :ఇవాళ దీనిపై సమీక్షించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఈ నెల 28 నుంచి ప్రతీ పల్లె నుంచి నగరం దాకా, అభయ హస్తం పేరిట ప్రభుత్వ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పండగ వాతావరణంలో ప్రారంభిస్తామని వెల్లడించారు.
వాహనదారులకు శుభవార్త - చలానా రాయితీలకు ప్రభుత్వం అనుమతి
Praja Palana to Solve Ground Level Problems in Telangana : విధ్వంసమైన తెలంగాణను అన్నిరంగాల్లో గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో(Collectorate Office) ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రులు తుమ్మల, పొంగులేటి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అధికారులు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నెల 28 నుంచి జరిగే గ్రామ సభల్లో మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో, అభయహస్తం పేరిట జరిగే ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఎంపిక చేయటం కానీ, వాళ్ల దరఖాస్తును ఆహ్వానించటం కానీ జరుగుతుంది. దాన్ని అమలుపరిచే దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన గ్యారెంటీలకు రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రహదారులు, భవనాలశాఖ మంత్రి
మండల అధికారుల నుంచి జిల్లా అధికారుల వరకు వివిధ స్థాయిల రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొనగా, మంత్రులు ప్రజాపాలన దరఖాస్తుల విధానం, ప్రజలకు అవగాహన కల్పించే అంశాలపై అధికార యంత్రాంగానికి అమాత్యులు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) మాట్లాడుతూ, పగబ్బంధీగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగించాలన్నారు.