KTR khammam tour : ఖమ్మం నగరాన్ని నంబర్ వన్‌గా మార్చాలనేదే మంత్రి పువ్వాడ అజయ్ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి మరో కార్పొరేషన్‌లో జరగడం లేదని.. ఇక్కడి అభివృద్ధి ఇతర కార్పొరేషన్లకు ఆదర్శం కావాలన్నారు. ఖమ్మం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్.. రూ.11.75 కోట్లతో లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన, చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటైన్, రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కేటీఆర్ ప్రారంభించారు. కేసీఆర్ అంటేనే నిలువెత్తు అభివృద్ధి అని.. కే అంటే కాలువలు.. సీ అంటే చెరువులు.. ఆర్ అంటే రిజర్వాయర్‌లు అని అభివర్ణించారు.
KTR in Khammam Tour : 'దేశంలో ఈ పరిస్థితులకు కారణమెవరు..?' - ఖమ్మం కేటీఆర్ పర్యటన న్యూస్
KTR khammam tour : తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు పోల్చిచూడాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. తాగు, సాగునీటితో పాటు విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘతన కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. ఖమ్మం నగరంలో పర్యటించిన కేటీఆర్.. మంత్రి పువ్వాడతో కలిసి లకారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన, చెరువు వద్ద మ్యూజికల్ ఫౌంటైన్, రఘునాథపాలెంలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
KTR khammam tour Updates : ‘‘గత ప్రభుత్వాల హయాంలో జిల్లాలోని లకారం చెరువును మురికి కూపంగా మార్చారు. తెరాస వచ్చిన తర్వాత చెరువును ఎంతో గొప్పగా అభివృద్ధి చేసుకున్నాం. చెరువుపై నిర్మించిన తీగల వంతెనను చూసేందుకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. మంచి పనులు జరిగేటప్పుడు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో వేలెత్తి చూపించేందుకు వీల్లేకుండా పనులు చేస్తుంటే సహజంగానే కొంత మంది విమర్శలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తుంటారు. అలాంటి ఒక కార్యక్రమాన్ని ఖమ్మంలో చేపట్టి ఒక నేతను రెచ్చగొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. అంతటితో ఆగకుండా బట్ట కాల్చి మీదేసినట్లు ఆ నేత చావుకు మంత్రి పువ్వాడను బాధ్యుడిని చేసేందుకు ప్రయత్నించారు." -- కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
KTR khammam tour News : కొంత మంది నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది భారతీయ ముస్లిం సోదరులు నిన్న నిరసన వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి పరిస్థితులు దేశంలో ఎందుకు వచ్చాయి? దీనికి కారణం ఎవరు? మంచిగా, పచ్చగా ఉన్న ఈ దేశంలో పక్కవాళ్లని అనుమానంతో చూసే విధంగా పరిస్థితులు కల్పిస్తున్నారు. నిజానికి ప్రభుత్వాలు, నేతలు ఇల్లు లేని పేదవాడి గురించి, నీళ్లు లేని గ్రామాల గురించి, పిల్లల ఉద్యోగాలు, కరెంటు లేని గ్రామాల గురించి ఆలోచించాలి. పేద ప్రజలకు ఏం కావాలో నేతలకు తెలియదా? కేవలం కులం, మతం పేరుతో ఓట్లు దండుకునేందుకు స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. పచ్చగా ఉన్న దేశంలో చిచ్చు పెడుతున్నారు’’ అని ప్రతిపక్షాలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.