తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం నుంచి.. కోదండరాం ఎన్నికల బరిలో దిగాలి' - హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం

ఖమ్మంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, నిరుద్యోగుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం-వరంగల్- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఉద్యోగాలు లేక కష్టాల్లో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

Kodandaram should contest for Hyderabad MLC position - Cheraku Sudhakar
కోదండరాం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం పోటీ చేయాలి –చెరకు సుధాకర్

By

Published : Nov 6, 2020, 11:13 AM IST

కలివిడిగా ఉద్యమాలు చేసి.. ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఉద్యమకారుల ఓట్లు చీలిపోతాయని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం-వరంగల్- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ స్పూర్తికి విఘాతం కలిగేలా ఎక్కువ మంది బరిలో నిలవడమంటే..ఎవరి వైపు కొమ్ముకాస్తున్నారో తెలుసుకోవాలని అన్నారు.

ఖమ్మంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, నిరుద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ తరపున ఉద్యోగాలు లేక కష్టాల్లో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులకు నిత్యావసర సరకులు అందజేశారు. ఉద్యమకారుల నుంచి వస్తున్న డిమాండ్లతోనైనా కోదండరాం హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలని చెరుకు సుధాకర్ సూచించారు కోరారు.

ఇవీ చదవండి: వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఖమ్మంలో వామపక్షాల ధర్నా

ABOUT THE AUTHOR

...view details