తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు: చెరుకు సుధాకర్​ రెడ్డి

పట్టభద్రుల సమస్యలపై మండలిలో ఎప్పుడూ మాట్లాడని పల్లా రాజేశ్వరరెడ్డికి.. ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్‌ అన్నారు. ఖమ్మంలో ఆపార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

By

Published : Oct 12, 2020, 6:22 PM IST

వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు: చెరుకు సుధాకర్​ రెడ్డి
వాళ్లకు ఓటు అడిగే హక్కు లేదు: చెరుకు సుధాకర్​ రెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ ఆరోపించారు. ఖమ్మంలో ఆ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన... జిల్లా అధ్యక్షుడు బత్తుల సోమయ్యతో కలిసి పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం ప్రారంభించారు.

సుమారు 60 వేల తప్పుడు ఓట్లను నమోదు చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌ జాగురతతో ఉండకపోతే దేశ చరిత్రలో మొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికలు అప్రతిష్ఠ పాలు అవుతాయన్నారు. ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన తాను... అన్ని పార్టీల మద్దతు కోరతానని తెలిపారు.

ఇదీ చూడండి:కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన పిటిషన్లపై ఎన్జీటీలో ముగిసిన వాదనలు

ABOUT THE AUTHOR

...view details