తెలంగాణ ప్రజల కోసం పుట్టిన.. ప్రజల కోసమే పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ కోరారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. మంత్రి పువ్వాడ, ఎంపీ నామలతో కలిసి పలు డివిజన్లలో పర్యటించారు.
'ప్రజల కోసమే శ్రమిస్తోన్న తెరాసకు అండగా నిలవాలి' - ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు
ప్రజల కోసం నిరంతరం శ్రమించే తెరాసను ఆశీర్వదించాలని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ఖమ్మం ప్రజలను కోరారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
హోం మంత్రి మహమూద్ అలీ, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, ఖమ్మం కార్పొరేషన్లో తెరాస ప్రచారం
కాంగ్రెస్, భాజపా నాయకులు ప్రచారం నిర్వహించే నాలుగు రోజులు మాత్రమే కనిపిస్తారని.. ఆ తర్వాత కనిపించరని మంత్రి మహమూద్ అలీ అన్నారు. అదే తెరాసను గెలిపిస్తే.. గులాబీ అభ్యర్థులు ప్రజల్లోనే ఉంటారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం తపించే తెరాసను ఆశీర్వదించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తెరాసకే ప్రజలు పట్టం కట్టారని ఎంపీ నామ తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చదవండి :కరోనా రోగుల కోసం 180 కి.మీ. ప్రయాణించి సేవలు