సింగరేణి కార్మికులకు(Singareni workers ) శుభవార్త(good news). వారి పదవీ విరమణ వయసును (retirement age)61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. ఈనెల 26న జరగనున్న బోర్డు సమావేశంలో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు
19:17 July 20
పదవీ విరమణ వయసు పెంచుతూ సీఎం నిర్ణయం
సింగరేణి ప్రాంత సమస్యలు, పరిష్కారాలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం (CM REVIEW) నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. పదవీ విరమణ వయసు పెంపుపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
ఈ నిర్ణయంతో 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనుంది. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.
సింగరేణి పరిధిలో బాధితులకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు కేసీఆర్‌ను కోరారు. ఇళ్లస్థలాల పంపిణీ ఆలస్యం చేయొద్దని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులు కొత్త జిల్లాల వారీగా కేటాయించారు. బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా దూసుకెళ్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సింగరేణి సిబ్బందికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది సింగరేణి ఆదాయం రూ.27 వేల కోట్లకు చేరనుందని తెలిపారు.
సొంత స్థలాలున్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యేలు నగదు సాయం కోరారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్లస్థానంలో కొత్తవి నిర్మించాలని కోరారు. సొంత స్థలాలున్న వారికి నగదు సాయంపై చర్చించి నిర్ణయిస్తామని సీఎం అన్నారు. దళిత బంధు అర్హులకు చేరేలా కృషిచేయాలని ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.