తెలంగాణ

telangana

ETV Bharat / state

లెక్కల మాస్టారుకు.. ఎనలేని సత్కారం! - Teacher's procession in Khammam district by old students

తమ ఉన్నతికి దోహదం చేసి, భవిష్యత్​కు పునాదులు వేసిన ఉపాధ్యాయుణ్ని విద్యార్థులు ఎన్నటికీ మర్చిపోరు. విద్యాబుద్ధులు నేర్పి, తమ జీవితాన్ని సక్రమ మార్గంలో తీర్చిదిద్దిన ఆ గురువును మనసులో పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు ఘనంగా సన్మానిస్తారు. ఖమ్మం నగరంలో అక్షర జ్ఞానాన్ని అందించిన లెక్కల మాస్టారును సత్కారించారు పూర్వ విద్యార్థులు.

Teacher's procession in Khammam district by old students
ఖమ్మం జిల్లాలో లెక్కల మాస్టారు ఊరేగింపు

By

Published : Feb 7, 2021, 12:09 PM IST

Updated : Feb 7, 2021, 12:21 PM IST

ఖమ్మం నగరం ఇందిరానగర్​ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు.. తమ భవిష్యత్​కు బంగారు బాట వేసిన గణితం మాస్టార్​ను ఘనంగా సత్కరించారు. జనవరి 31న ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుడు వజ్రాల వెంకట్ రెడ్డిని విద్యార్థులంతా ఆయన ఇంటి నుంచి ఓపెన్ టాప్ జీపులో ఎక్కించుని.. నగర వీధుల్లో ఊరేగించారు.

ఖమ్మం జిల్లాలో లెక్కల మాస్టారు ఊరేగింపు

దారి పొడవునా పూలు చల్లుతూ గురుదక్షిణ చెల్లించారు. వెంకట్ రెడ్డి కృషి వల్ల ఎంతో మంది విద్యార్థులు.. ప్రభుత్వ పాఠశాలలో చదివినా.. ఉన్నత స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన వద్ద చదువుకున్న వారిలో ఎక్కువ మంది సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు, ఉపాధ్యాయులు ఉండటం విశేషం.

Last Updated : Feb 7, 2021, 12:21 PM IST

ABOUT THE AUTHOR

...view details