ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఓ ఉపాధ్యాయుడు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వినూత్నంగా ప్రచారం చేశాడు. కల్లూరు మండలానికి చెందిన ఎస్‌జీటీ దంతల సుధాకర్ తన ద్విచక్రవాహనానికి మైకు బిగించి కరోనా నుంచి కాపాడుకునే జాగ్రత్తలు వివరిస్తున్నాడు.
కరోనాపై టీచర్ వినూత్న ప్రచారం
రోజూ విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు ఏ చేయాలని ఆలోచించాడు.. అంతే బైక్ తీసుకున్నాడు.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని పూనుకున్నాడు. రోజుకు ఒక గ్రామం చొప్పున తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు.
కరోనాపై టీచర్ వినూత్న ప్రచారం
తల్లాడ మండలంలో పలు గ్రామంలో తిరిగి చైతన్యం కల్పించాడు. స్వీయ నిర్బధంతో కరోనాను నివారించవచ్చని, ద్విచక్రవాహనాలపై ఒక్కరే ప్రయాణం చేయడం, మూకుమ్మడిగా మాట్లాడకుండా ఉండటం వంటి వాటిపై వివరించారు. నియోజకవర్గంలో సంచరిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేస్తున్న సేవను తల్లాడ మండల ప్రజలు అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే స్పూర్తితో గ్రామాల్లో అవగాహన పెంచితే కరోనా మహమ్మారిని ప్రారదోలే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
ఇదీ చూడండి :గృహ హింస ఫిర్యాదులకు సంప్రదించండి
Last Updated : Apr 20, 2020, 12:48 PM IST