మధిర పురపాలక సంఘం ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా మధిరలో తేదేపా ఆందోళన చేపట్టింది. మధిర పురపాలికలో విలీన గ్రామమైన మడుపల్లికి సులువైన రాకపోకలకు వీలుగా వైరా నదిపై వంతెన లేదా కాజ్వే నిర్మించాలని కోరారు. ఎన్నికల వేళ తెరాస ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చినా... నేటికీ కార్యరూపం దాల్చలేదని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం విమర్శించారు.
ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెదేపా డిమాండ్ - తెలంగాణ వార్తలు
మధిర పురపాలిక ఎన్నికల వేళ తెరాస నేతలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. ఎన్నో హామీలు ఇచ్చినా... నేటికీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. వైరానదిపై వంతెన లేదా కాజ్వే నిర్మించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు.
![ఎన్నికల హామీలు నెరవేర్చాలని తెదేపా డిమాండ్ tdp protest, Khammam protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11434585-thumbnail-3x2-tdp---copy.jpg)
హామీలు నెరవేర్చాలని తెదేపా ఆందోళన, ఖమ్మం తెదేపా ఆందోళన
కాజ్వే అవసరం చాలా ఉన్నప్పటికీ కేవలం చెక్ డాం మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాజ్వే నిర్మాణంతో ఏపీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలు వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. తక్షణమే ప్రభుత్వ పెద్దలు తమ హామీని నెరవేర్చాలని... లేనిపక్షంలో పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.