ఖమ్మం జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా.. వాటిని కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫమయ్యారని తెదేపా నాయకులు ఆరోపించారు. వైరాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: తెదేపా - ఖమ్మ జిల్లా తాజా వార్తలు
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ... ఖమ్మం జిల్లా వైరాలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ కార్యాలయం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా కట్టడిలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది: తెదేపా
వైరా నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఇంటింటికి వెళ్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ప్రజలు చావుకేకలు పెడుతుంటే.. నిర్మాణాల పేరుతో ప్రభుత్వ కాలం గడపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్