లద్దాక్‌లోని గాల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల ఘర్షణలో మృతి చెందిన భారత జవాన్లకు ఖమ్మంలో తెదేపా నాయకులు నివాళి అర్పించారు. తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో కల్నల్ సంతోశ్‌బాబు చిత్రపటానికి పూలమాల వేసి సంతాపం ప్రకటించారు.
అమర జవాన్లకు ఖమ్మంలో తెదేపా నివాళి - గాల్వన్ లోయ కల్నల్ సంతోశ్
గాల్వన్ ఘటనలో అమరులైన భారత జవాన్లకు ఖమ్మంలో తెదేపా నాయకులు నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో కల్నల్ సంతోశ్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం ప్రకటించారు.

అమర జవాన్లకు ఖమ్మంలో తెదేపా నివాళి
సంతోశ్ బాబు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చైనా కవ్వింపు చర్యలు మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భారత మిలటరీ దళాల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.
ఇవీ చూడండి:కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!