తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం దృష్టికి తీసుకెళ్లి.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా: ఎమ్మెల్యే సండ్ర - రామచంద్రాపురంలో అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా రామచంద్రాపురంలో బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5వేల ఆర్థికసాయం, బియ్యం, దుస్తులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

Take the CM's attention .. Do justice to the victims: MLA Sandra
సీఎం దృష్టికి తీసుకెళ్లి.. బాధితులకు న్యాయం చేస్తా: ఎమ్మెల్యే సండ్ర

By

Published : May 22, 2020, 8:20 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామచంద్రాపురంలో అగ్నిప్రమాద బాధితులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5వేల ఆర్థికసాయం, బియ్యం, దుస్తులు, వంట సామగ్రి, నిత్యావసరసరకులు పంపిణీ చేశారు. ప్రమాదానికి గురైన ఇళ్లను పరిశీలించి.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

అనుకోకుండా జరిగిన ప్రమాదం.. ఊహకందని నష్టం

పొలాల్లో వరిగడ్డికి పెట్టిన నిప్పు.. సమీపంలోని పూరి గుడిసెలకు అంటుకున్నట్లు స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. రైతులు స్థానిక పోలీసులకు సమాచారం అందించాకే.. చెత్తను తగులబెట్టాలని సూచించారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో.. ఊహకందని నష్టం వాటిళ్లిందని.. ఏడు కుటుంబాల ప్రజలు నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు

ABOUT THE AUTHOR

...view details