నిత్యం కార్యాలయాల్లో దస్త్రాల మధ్య పని చేసే ఉద్యోగులు చీపురు పట్టుకుని తమ కార్యాలయ ఆవరణను శుభ్రం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయ ఆవరణను శుభ్రపరచేందుకు ఇటీవలే ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన ట్రైనీ ఐఏఎస్ అధికారి ఆదర్శ సురభి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో కలిసి ఆవరణను శుభ్రం చేశారు.
రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛభారత్ - ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛభారత్
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఫీస్ ఆవరణలో పేరుకున్న చెత్తను శుభ్రం చేసుకున్నారు.
రఘునాథపాలెం ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛభారత్