ఖమ్మం జిల్లా సుజాతనగర్ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా సేవలందించిన సీతారామయ్య కరోనా బారిన పడి మృతి చెందారు. కామేపల్లి మండలం పండితపురానికి చెందిన సీతారామయ్య స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా జైలు జీవితం గడిపారు. కొన్నాళ్లపాటు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన.. ఖమ్మం న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా విధులు నిర్వర్తించారు.
కరోనాతో సుజాతనగర్ తొలి ఎమ్మెల్యే సీతారామయ్య మృతి - sujathanagar first mla seetharamaiah died of corona in khammam district
ఖమ్మం జిల్లా సుజాత నగర్ మాజీ ఎమ్మెల్యే సీతారామయ్య కరోనాతో మృతి చెందారు. నియోజకవర్గం తొలి ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన.. ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పనిచేశారు.
కరోనాతో సుజాతనగర్ తొలి ఎమ్మెల్యే మృతి
1978లో సుజాతనగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా సీతారామయ్య పోటీ చేసి గెలుపొందారు. అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. పదవీకాలం పూర్తయిన అనంతరం హైకోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఉద్దేశంతో రూ. కోటికి పైగా ఖర్చు చేసి మినరల్ వాటర్ ప్లాంట్లను నెలకొల్పారు.
ఇదీ చదవండి:పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్