తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యాయం కోసం ధర్నా - rythubandhu

ఖమ్మం జిల్లా మధిరలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు కుటుంబం న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది.

రైతు కుటుంబం నిరాహార దీక్ష

By

Published : Feb 26, 2019, 8:26 PM IST

రైతు కుటుంబం నిరాహార దీక్ష
ఖమ్మం జిల్లాలోని వెంకటాపురం గ్రామానికి చెందిన ధరావత్ బద్రి అనే రైతుకు పలు సర్వే నంబర్లలో 13 ఎకరాల ఏడు గుంటల భూమి ఉంది. దీనికి కొత్త పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త పుస్తకంలో 37 గుంటల భూమి తక్కువగా నమోదు కావడంతో సరిచేయాలని అధికారులను ప్రాధేయపడ్డాడు. ఇందుకు వీఆర్వో లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

లంచం ఇచ్చినప్పటికీ...!

బాధితుడు రూ.50 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకొని మొదటి విడతగా రూ.25 వేలు లంచం ఇచ్చాడు. అయినా రికార్డులు సరిచేయలేదు. డబ్బు తీసుకొన్న సదరు వీఆర్వో పదవీ విరమణ చేశాడు. ఈ సమస్యపై పలుమార్లు వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా... న్యాయం జరగలేదు. చివరకు బద్రి తన కుటుంబసభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. న్యాయం చేస్తామని అధికారులు రైతుకు హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి:కలెక్టరేట్​ ముందు ధర్నా

ABOUT THE AUTHOR

...view details