ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేసేందుకు గాను పోలీస్ శాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకల నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సబ్‌డివిజన్‌లోని పోలీస్ అధికారులు, సిబ్బంది వైరాలో మోహరించి.. ఎక్కడిక్కడ వాహనాలను నిలిపివేయడం.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం చేస్తున్న వారికి జరిమానాలు, కేసులు నమోదు చేయడం వంటి కఠిన చర్యలు చేపట్టారు.
పోలీస్ జంబ్లింగ్ విధానంతో పటిష్ఠంగా లాక్డౌన్ అమలు - పోలీస్ జంబ్లింగ్ విధానంతో పటిష్టంగా లాక్డౌన్ అమలు
ఖమ్మం జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేసేందుకు గాను పోలీస్ శాఖ ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. పోలీస్ జంబ్లింగ్ విధానంతో కట్టడి చేస్తామని ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
police
వైరా, మధిర సీఐలు.. ఆరు మండలాల ఎస్సైలు సిబ్బంది పెద్ద సంఖ్యలో తనిఖీలు చేపట్టారు. రింగ్‌రోడ్, పాత బస్టాండ్, మధిర రోడ్‌తో పాటు పలు కూడళ్లు, ప్రధాన వీధుల్లో గస్తీ చేశారు. ప్రతిరోజు ఇదే తరహాలో తనిఖీ చేస్తామని.. పోలీస్ జంబ్లింగ్ విధానంతో కట్టడి చేస్తామని ఏసీపీ తెలిపారు.
- ఇదీ చూడండి: గాంధీలో కేసీఆర్... రోగులకు ధైర్యం చెప్పిన సీఎం