తెలంగాణ

telangana

ETV Bharat / state

Stray Dogs Attack in Telangana : తెలంగాణలో డాగ్ టెర్రర్.. వీధికుక్కల దాడిలో చిన్నారులకు గాయాలు - శంషాబాద్​లో ఐదుగురు విద్యార్థులపై కుక్కల దాడి

Stray Dogs Attack in Telangana : రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద రోజురోజుకు పెరిగిపోతుంది. తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపించాలంటే జంకుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో 24 ఏరియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా వారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. మరోవైపు రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్​లో ఐదుగురు చిన్నారులపై వీడికుక్కలు దాడికి దిగాయి.

Students Seriously Injured in Stray Dog Attack
Two Students Seriously Injured in Stray Dog Attack in Khammam

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2023, 2:26 PM IST

Stray Dogs Attack in Telangana : రాష్ట్రంలో కుక్కల బెడదల రోజురోజుకు పెరిగిపోతోంది. ఇంట్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చాలు.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే శునకాల దాడి(Stray Dogs Attack)లో పలు చోట్ల ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఎందరో పిల్లలు గాయాలపాలయ్యారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని ఇల్లందు పట్టణంలో 24 ఏరియాకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా వారిపై వీధి కుక్కలు దాడి(Stray Dog Attack Students) చేశాయి. ఈ దాడిలో ఆ చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

Stray Dogs Attack in Khammam :ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణంలోని 24 ఏరియాకు చెందిన 7వ తరగతి చదువుతున్న ముస్కాన్, రెండో తరగతి చదువుతున్న చింత కీర్తనలు ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తున్నారు. ఇంట్లో నుంచి బయల్దేరిన కాసేపటికే వారిపై ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి. శునకాల దాడిలో ఆ ఇద్దరి తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. వారి అరుపులు విన్న స్థానికులు కుక్కలను తరిమికొట్టి పిల్లలను కాపాడారు. గాయపడిన వారిని.. కుటుంబ సభ్యులు ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చాలా రోజులుగా ఈ ప్రాంతంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పిల్లలను, పెద్దలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.

వీధి కుక్కల దాడి- రెండున్నర ఏళ్ల చిన్నారి మృతి

Dog Attacks in Telangana 2023 : రోజు పాఠశాలకు వెళ్తున్న తమ పిల్లలకు భద్రత లేకుండా పోయిందని తల్లిదండ్రులు అంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వీధికుక్కలు రోజురోజుకు విజృంభిస్తున్నాయని.. ఈ దాడుల్లో తమ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అను నిత్యం ఇబ్బందులు ఎదురవుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని వాపోయారు. అదృష్టవశాత్తు గాయాలతో మాత్రమే పిల్లలు బయటపడ్డారని ఊపిరిపీల్చుకున్నారు.

Stray Dog Attacks in Shamshabad : మరోవైపు శుక్రవారం రోజున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో ఐదుగురు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఐదుగురు పిల్లలు ఇంటి ముందు ఎంతో ఆనందంగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన వీధి శునకాల గుంపు చిన్నారులపై ఒక్కసారిగా దాడి చేశాయి. స్థానికులు గమనించి పెద్దపెద్ద కేకలు వేయడంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారులను తల్లిదండ్రులు శంషాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్కల దాడి అనంతరం చిన్నారుల దుస్తులపై ఉన్న రక్తం, వారి ఏడుపును చూసిన తల్లిదండ్రులు, స్థానికులు తల్లడిల్లిపోయారు.

Dog Attack on Kids in Shadnagar : చిన్నారులపై వీధికుక్క దాడి.. వీడియో వైరల్

వీధి కుక్కల దాడిలో.. బాలికకు తీవ్రగాయాలు

ABOUT THE AUTHOR

...view details