సుమారు రెండు నెలల తర్వాత స్థంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నిబంధనలు పాటించే భక్తులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఖమ్మంలోని గుంటుమల్లేశ్వరాలయం, జలాంజనేయస్వామి ఆలయం, శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయాల్లో స్వల్పంగా భక్తులు దర్శనానికి వస్తున్నారు.
మాస్క్ ధరిస్తేనే దేవుడి దర్శనం - భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. భక్తులకు తీర్థం, ప్రసాదం ఇవ్వడం లేదని దేవాదాయ శాఖ ఖమ్మం జిల్లా అధికారి జగన్ మోహన్ రావు తెలిపారు. లాక్డౌన్ అనంతరం స్థంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేశాకే భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు.
మాస్క్ ధరిస్తేనే దేవుడి దర్శనం
ముందుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత థర్మల్ స్క్రీనింగ్ చేసి భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. నిబంధనల ప్రకారం తీర్థం, ప్రసాదం ఇవ్వడం లేదని దేవాదాయ శాఖ జిల్లా అధికారి జగన్ మోహన్ రావు తెలిపారు.
ఇదీ చూడండి:తీవ్ర ఉత్కంఠ.. ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూపు