తెలంగాణ

telangana

ETV Bharat / state

వేదాద్రి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: మంత్రి పువ్వాడ - వేదాద్రి బాధితులకు పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

ఏపీలోని కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

state government has announced compensation for the Vedadri victims
వేదాద్రి బాధితులకు పరిహారం

By

Published : Jun 18, 2020, 11:49 AM IST

ఏపీలోని కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడిన పువ్వాడ.... వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

ప్రమాదంలో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపారం గ్రామానికి చెందిన 10 మంది మృతి చెందగా... ఏపీ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు చనిపోయారు. వీరందరికీ పరిహారం అందించనున్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్..... ఘటనపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.

ఇవీ చూడండి:కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. 12 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details