తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏన్కూరులో లక్ష్మీదేవి జాతరకు సర్వం సిద్ధం - Offering of Mokkas to the village gods on the first day

శ్రీ లక్ష్మీదేవి జాతరను.. ఏన్కూరు మండలం కాలనీ నాచారంలో ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించే పూజల్లో భాగంగా తొలిరోజు గ్రామదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆదివాసీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

Sri Lakshmi Devi Jataka prepared in Encore Mandalam
ఏన్కూరులో లక్ష్మీదేవిజాతరకు సర్వంసిద్ధం

By

Published : Jun 13, 2020, 9:53 PM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కాలనీ నాచారంలో శ్రీ లక్ష్మీదేవి జాతరను ఆదివాసీలు ఘనంగా నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించే పూజల్లో భాగంగా ఆదివాసీలు తొలిరోజు గ్రామదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. సంప్రదాయ మేళాలతో నృత్యాలు చేస్తూ దేవతలకు పూజలు చేశారు.

రాత్రంతా కొనసాగనున్న జాతర..

పూజారులు లక్ష్మీదేవి అమ్మవారిని గద్దెల వద్దకు తీసుకెళ్లి జాతరకు సిద్ధం చేశారు. రాత్రంతా కొనసాగనున్న జాతరకు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆదివాసీలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

ఇదీ చూడండి:24 గంటల్లో 11,458 మందికి కరోనా- 386 మంది బలి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details