తెలంగాణ

telangana

ETV Bharat / state

అవి పాలు కాదు.. ఆరోగ్యాన్ని హరించివేసే కాలకూట విషం! - Adulterated milk in Khammam district news

చిక్కదనానికి చిక్కదనం.. వెన్నశాతానికి వెన్నశాతం.. అబ్బా అనిపించేలా కమ్మనైన గుమ్మపాల వాసన! కానీ ఆ పాలు తాగితే ఆరోగ్యాలు గుల్లవుతాయి. దవాఖానా ఖర్చులతో జేబులకూ చిల్లూ తప్పదు. ఎందుకంటే.. అవి పాలు కాదు.. ఆరోగ్యాన్ని నెమ్మది నెమ్మదిగా హరించివేసే కాలకూట విషం!

Adulterated milk
అవి పాలు కాదు.. ఆరోగ్యాన్ని హరించివేసే కాలకూట విషం!

By

Published : Dec 22, 2020, 4:47 PM IST

కల్తీకి కాదేది అనర్హం.. అన్న నానుడిని అక్షరాల రద్దు చేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిరలోని కొందరు వ్యాపారులు. ఆహార పదార్థాలనే కాదు.. చివరకు తాగే పాలను కృత్రిమంగా తయారు చేసి.. కల్తీకి పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడుతూ.. కాసులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఖమ్మం జిల్లా మధిర సుందరయ్య నగర్​లో నివాసముండే గడ్డం జ్యోతి పాలను కొనుగోలు చేసింది. రోజులాగే పాలు వేడి చేస్తుండగా పాలు విరిగిపోయాయి. మాములుగా అయితే విరిగిన పాలు ఒకేలా ఉంటాయి. కానీ ఈ పాలు గడ్డలు, గడ్డలుగా మారిపోయి అవి ప్లాస్టిక్​ను తలపించేలా సాగుతూ వచ్చాయి. లీటర్​కు 65 రూపాయలు వెచ్చించి.. కొనుగోలు చేసిన పాలు కూడా కృత్రిమంగా తయారు చేసినవి కావడంతో ఆందోళన చెందుతున్నారు.

గతంలో ఆ మధ్య ఓ వ్యక్తి ఏకంగా గేదెలు లేకుండానే ప్రముఖ కంపెనీకి రోజుకు ఆరు నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుండగా.. స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. తనిఖీల్లో ఇంట్లోనే యూరియా, ఇతర మిశ్రమాలు కలిపి పాలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. ఇలా ఏదో ఒక ప్రాంతంలో పాలను కృత్రిమంగా తయారు చేయడం పరిపాటిగా మారింది.

కల్తీని నియంత్రించాల్సిన అధికారులు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం రెండు జిల్లాలకు ఒకే ఒక్కరు ఉన్నారు. దీనితో కల్తీని అరికట్టలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసాన్ని వండుతున్నారు. ఈ కల్తీని అరికట్టేందుకు ప్రభుత్వ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details