తెలంగాణ

telangana

By

Published : May 9, 2021, 4:47 PM IST

ETV Bharat / state

అమానుషం: కరోనా సోకిందని మాతృమూర్తిని ఇంట్లోనేే.!

మాతృ దినోత్సవం నాడే ఆ అమ్మకు అవమానం జరిగింది. తన పిల్లల భవిష్యత్తు కోసం పరితపించే మాతృమూర్తి పట్ల అమానుషంగా ప్రవర్తించారు ఆ దుర్మార్గులు. కరోనా సోకిందని తెలిసి కన్నతల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. ఈ అమానవీయ సంఘటన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది.

Sons are leave her mother in their house
మధిరలో కన్నతల్లిని వదిలేసి వెళ్లిన కుమారులు

ఖమ్మం జిల్లా మధిరలో అమానవీయ సంఘటన జరిగింది. కరోనా సోకిందని కన్న తల్లినే వదిలేశారు ఆమె కుమారులు. పేగు బంధానికి ఉన్న విలువను కాల రాశారు. అండగా ఉండాల్సిన సమయంలో ఆ వృద్ధురాలిని కనికరం లేకుండా తమ కుటుంబాలతో సహా వెళ్లిపోయారు.

మధిరలో కన్నతల్లిని వదిలేసి వెళ్లిన కుమారులు

మధిరలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉండే గద్దల రాహేల్ అనే వృద్ధురాలికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరు కొడుకులు తల్లి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. కూతురు హైదరాబాద్‌లో ఉంటోంది. ఇంతలోనే ఆ తల్లికి కొవిడ్ నిర్ధరణ కావడంతో కుమారులిద్దరూ తమ కుటుంబాలను తీసుకుని వెళ్లిపోయారు.

కౌన్సిలర్ సాయం..

దీనిపై సమాచారం అందుకున్న పురపాలక కౌన్సిలర్ గద్దల మాధురి రెస్క్యూ టీంను పంపించారు. వారు 108 అంబులెన్స్‌ ద్వారా వృద్ధురాలిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాతృ దినోత్సవం రోజే కన్నతల్లికి ఇలాంటి పరిస్థితి రావడంతో స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది సృష్టిలోనే లేదు: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details