తెలంగాణ

telangana

ETV Bharat / state

జడ్పీటీసీ భర్తపై దాడి... అనుచరుల ఆందోళనలు.. - ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బద్రుతండాలో ఆందోళనలు

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బద్రుతండాలో జడ్పీటీసీస బదావత్ బుజ్జి భర్తపై ప్రత్యర్థులు దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాలాజీ ప్రస్తుతం ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

some people attacked khammam zptc husband in badruthanda
జడ్పీటీసీ భర్తపై దాడి... అనుచరుల ఆందోళనలు..

By

Published : Jul 25, 2020, 9:31 AM IST

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం బద్రుతండాలో జడ్పీటీసీ బాదావత్ బుజ్జి భర్త బాలాజీపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తండా సమీపంలోని పొలాల్లో ఆయన ప్రత్యర్థులు దాడి చేసి గాయపరిచారు. పొలంలో పడిఉన్న బాలాజీని... స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గ్రామాల్లో రాజకీయ కక్షల నేపథ్యంలోనే ప్రత్యర్థులు దాడి చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

జడ్పీటీసీ భర్తపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న మండలంలోని వివిధ గ్రామాల అనుచరులు ఏన్కూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని ప్రధాన రహదారిపై బైఠాయించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట కూడా రాస్తారోకో చేశారు. స్పందించిన పోలీసులు నిందితులను కఠినంగా శిక్షిస్తామని వారికి నచ్చజెప్పి ఇంటింకి పంపించారు. ధర్నా కారణంగా ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ABOUT THE AUTHOR

...view details